‘ఛ‌త్ర‌ప‌తి’ రీమేక్‌కి నో చెప్పిన ద‌ర్శ‌కుడు : సుజిత్

‘ఛ‌త్ర‌ప‌తి’ రీమేక్‌కి నో చెప్పిన ద‌ర్శ‌కుడు : సుజిత్ 



సాహో సినిమా త‌ర‌వాత‌... దర్శకుడు సుజిత్ ఖాళీగా ఉన్నాడు. 'లూసీఫ‌ర్' సినిమా రీమేక్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మ‌రో రీమేక్ అతన్ని వెత్తుకుంటూ  వచ్చింది. అయితే ఆ రీమేక్కి "నో" చెప్పేశాడు. ప్ర‌భాస్ – రాజ‌మౌళి కంబినేషన్లో ఉన్న  ఛ‌త్ర‌ప‌తి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. ఈ సినిమాకి బాలీవుడ్లోని ద‌ర్శ‌కుడినే తీసుకోవాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారు. ఈ లిస్టులో ముందుగా మాట్లాడుకున్న పేరు… 'సుజిత్'.అతను తీసిన 'సాహో' సినిమా  ద‌క్షిణాదిన పెద్ద‌గా ఆడ‌క‌పోయినా… నార్త్ లో మంచి హిట్ అందుకుంది. అందుకే సుజిత్ ని ప్రవేశపెట్టారు . అయితే సుజిత్ ఈ సినిమా రీమేక్ చేయ‌డం ఇష్టం లేద‌ని తేల్చాడు. పైగా యూవీ క్రియేష‌న్స్‌లో సుజిత్ మరో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. సాహో త‌ర‌వాత‌.. యూవీతో సినిమా చేయాల‌న్న‌ది ఒప్పందం . ఓ క‌థ రెడీ చేసి, హీరోని వెతికి  ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నాడు. ఇవ్వన్నీ కుదిరితే.. జ‌న‌వ‌రిలో ఈ సినిమా మొద‌లు కావొచ్చు. `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ కూడా జ‌న‌వ‌రిలోనే మొదలుపెట్టాలి. అందుకే… సుజిత్ ఈ సినిమాని వ‌దులుకోవాల్సివ‌చ్చింద‌ని చెప్పారు. సుజిత్ చేయకపోవడంతో  ప్ర‌భుదేవా, వినాయ‌క్ ల‌ని కలవాలని నిర్మాత‌లు నిర్ణయించారు. ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నారని తెలుస్తోంది.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.