వరల్డ్ చాంపియన్ హామిల్టన్‌కు కరోనా
వరల్డ్ చాంపియన్ హామిల్టన్‌కు కరోనా
ఫార్ములా వన్ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో సాఖిర్ గ్రాండ్ ప్రికి దూరమవుతున్నట్లు మెర్సెడీజ్-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్1 టీమ్ తెలిపింది. గత వారంలో హామిల్టన్‌కు 3 సార్లు పరీక్షలు చేయగా..నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే సోమవారం ఉదయమే అతనికి కరోనా లక్షణాలు కనిపించాయని టీమ్ తెలిపింది. ఆ తర్వాత టెస్ట్ చేస్తే కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది.

కామెంట్‌లు లేవు