తెలుగు వర్సిటీ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ విడుదల

 తెలుగు వర్సిటీ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ విడుదల



హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. దూర విద్య కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ కోర్సుల పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం నాడు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ విడుదల చేశారు. డిసెంబరు 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం teluguuniversity.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.