ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరోజు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది. మొదటి రోజు 13 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ రెండో రోజు ఒక్క ఎమ్మెల్యే మీదే చర్యలు తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరును గర్హిస్తూ ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు ఇచ్చారు.
కామెంట్‌లు లేవు