తెలంగాణ కరోనా బులిటెన్ - Corona News
గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,31,683కు చేరుకుంది. 24 గంటల్లో కరోనాతో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,729కి పెరిగింది. నిన్న మరో 869 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 6,32,552కు చేరుకుంది. ప్రస్తుతం 10,316 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కామెంట్‌లు లేవు